బాలయ్య - గోపీచంద్.. డేట్ ఫిక్స్!!


నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను తీస్తున్న అఖండ సినిమా షూటింగ్ అయితే మొత్తానికి పూర్తయ్యింది. దాదాపుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దీని తరువాత మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు.

ప్రఖ్యాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు వినాయక చవితి పర్వదినం రోజున జరుగనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. త్వరలో ఈ మూవీకి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులని అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post