పూజా హెగ్డే పై రోజా భర్త ఫైర్ !


ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు భారీ క్రేజ్ తో దూసుకెళుతోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ రాధేశ్యామ్, సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ ల సినిమా అలానే అఖిలి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఉన్నాయి. అవి మాత్రమే కాక తమిళ్ లో విజయ్ తో బీస్ట్ సినిమా కూడా చేస్తున్న పూజా, ప్రస్తుతం మరొక టాలీవుడ్ బడా మూవీ ఛాన్స్ కూడా కొట్టేసిందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మ్యాటర్ ఏమిటంటే, ప్రముఖ నటి వైఎస్సార్సిపి ఎమ్యెల్యే రోజా భర్త సెల్వమణి నేడు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా నటి పూజా హెగ్డే పై పలు విమర్శలు చేసారు

తన కెరీర్ లో మొదట తనతో పూజా కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే షూటింగ్ స్పాట్ కి తోడుగా తెచ్చుకునేవారని, అయితే రాను రాను మంచి సినిమా ఛాన్స్ లు రావడం వాటితో భారీ సక్సెస్ లు కొట్టడంతో ప్రస్తుతం ఆమె తనతో పాటు షూట్ లొకేషన్స్ కి మొత్తం తన టీమ్ 12 మందిని తోడుగా వెంట తీసుకువస్తుందని, ఆ విధంగా ప్రొడ్యూసర్స్ కి వారందరి ఖర్చులు భరించవలసి పరిస్థితులు తలెత్తుతున్నాయని, అసలు ఈ విధంగా ప్రొడ్యూసర్స్ పై ఆమె భారం వేయడం ఎంతరకు కరెక్ట్ అంటూ పూజా పై సెల్వమణి చేసిన విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై పూజా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post