గత ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అనేక రంగాలు కూడా పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టబడ్డాయి. ఇక మన దేశంలో అయితే మిగతా రంగాలతో పాటు సినిమా రంగం మీద కూడా కరోనా ప్రభావం బాగా పడింది అనే చెప్పాలి. గత ఏడాది డిసెంబర్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మళ్ళి థియేటర్స్ ఓపెన్ అయి, ఆ తరువాత సంక్రాంతికి క్రాక్, జాంబీ రెడ్డి, రెడ్, ఉప్పెన వంటి సినిమాల సక్సెస్ లతో మళ్ళి కళని తీసుకువచ్చింది. అయితే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ సడన్ గా విజృంభించడంతో ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు సినిమా థియేటర్స్ కూడా మూతబడ్డాయి.
ఇక ఇటీవల కొద్దిరోజులుగా పలు సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతున్నప్పటికీ ఇంకా చాలా ఏరియాల్లో మాత్రం కొన్ని థియేటర్స్ పూర్తిగా తెరుచుకోనే లేదు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్స్ సినిమాని బట్టి నిర్ణయిస్తాం అంటూ ఇటీవల ఒక ప్రకటన చేసింది. దానితో పాటు టాలీవుడ్ కి సంబంధించి అనేక సమస్యలు ఉండడంతో వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసేందుకు సిద్దమైన ఇండస్ట్రీ పెద్దలు, ఇటీవల మంత్రి పేర్ని నానిని కలిశారు. ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమై తమ ప్రధాన సమస్యలు చర్చించడం జరిగింది. అలానే త్వరలో సీఎం అపాయింట్మెంట్ తీసుకుని అందరూ ఆయనని కలిసి వాటిపై చర్చించదలచినట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే త్వరలో సినిమాలకు, సినిమా పరిశ్రమకు మంచి రోజులు రానున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు.
Follow @TBO_Updates
Post a Comment