సుధీర్ బాబు, ఆనంది కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా శ్రీదేవి సోడా సెంటర్. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా రూపొందిన ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకుడు. ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, యూనిట్ కోరిక మేరకు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ కోసం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ లవ్ డ్రామా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్ ముఖ్య పాత్ర చేస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ దీనికి సంగీతం అందించారు. కాగా ఈ మూవీ బిజినెస్ పరంగా రూ. 12.5 కోట్ల మేర నాన్ థియేట్రికల్ రైట్స్, అలానే రూ. 10 కోట్ల థియేట్రికల్ రైట్స్ కి అమ్ముడుపోగా, ఇది మంచి సక్సెస్ కొట్టి బయ్యర్లు బ్రేక్ ఈవెన్ జోన్ లోకి చేరాలి అంటే రూ. 10.5 కోట్ల మేర కలెక్షన్ అందుకోవాలని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి అందరి అంచనాలు శ్రీదేవి సోడా సెంటర్ ఎంతరకు అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment