గోపీచంద్ కోసం రాబోతున్న ప్రభాస్?


శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్ తో శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సీటీ మార్. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగె యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించే విధంగా తెరకెక్కిస్తున్నఈ సినిమా టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

ఇక లేటెస్ట్ గా పలు సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మరొక రెండు రోజుల్లో జరుగనున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో మాట్లాడిన యూనిట్, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తోందట. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ మూవీ ట్రైలర్ ని ఆవిష్కరించగా, సినిమా ఈనెల 10వ తేదీన ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Post a Comment

Previous Post Next Post