మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. కాగా జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అయితే దీని తరువాత మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు మెగాస్టార్.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి గడ్ ఫాదర్ అనే టైటిల్ యూనిట్ పరిశీలిస్తుండగా ఒరిజినల్ వర్షన్ లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రని తెలుగులో కేజ్రీ యాక్టర్ గా పేరు సంపాదించిన సత్య దేవ్ దక్కించుకున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మోహన్ రాజా తీస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగాసూపెర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment