వెండితెరపై సల్మాన్ ఖాన్ - మెగాస్టార్ కాంబో?


మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఎంత వేగంతో సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల లూసిఫర్ రీమేక్ గా రానున్న గాడ్ ఫాదర్ సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది యువ హీరోల పేర్లు చర్చల దశలోకి రాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ పేరు కొత్తగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ ఆఫర్ వస్తే గనక సల్మాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడని చెప్పవచ్చు. ఎందుకంటే అతనికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ కూడా మంచి స్నేహితుడు. గతంలో మెగా కోడలు ఉపాసన కూడా సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. కాబట్టి సల్మాన్ ఖాన్ మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post