పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి దగ్గుబాటి వారసుడు రానా తొలిసారిగా యాక్ట్ చేస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఇటీవల మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం మూవీ అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా యాక్ట్ చేస్తుండగా, డ్యానియేల్ శేఖర్ గా రానా కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇటీవల ఈ మూవీ నుండి భీమ్లా నాయక్ మాస్ లుక్ లో పవర్ స్టార్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై అందరి నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ యూట్యూబ్ లో భారీ రికార్డ్స్ తో దూసుకెళుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా నుండి రానా దగ్గుబాటి పోషిస్తున్న డ్యానియేల్ శేఖర్ ఫస్ట్ లుక్ టీజర్ ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ మూవీకి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు ..... !!
Follow @TBO_Updates
Post a Comment