చరణ్ కోసం చెక్కుతున్న గౌతమ్!


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమురం భీం గా యాక్ట్ చేస్తుండగా సాయి మాధవ్ బుర్రా దీనికి డైలాగ్స్ రాస్తున్నారు. భారీ పేట్రియాటిక్ డ్రామా సినిమాగా యాక్షన్, కమర్షియల్ హంగులతో దర్శకుడు రాజమౌళి దీనిని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ అక్టోబర్ లో విడుదల కానుంది. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై దిల్ రాజు నిర్మాతగా శంకర్ తీయనున్న భారీ సినిమా చేయనున్నారు చరణ్. 

థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలీవూడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల కానుంది. ఈ మూవీ అనంతరం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ ఒక మూవీ చేయనున్నారు అనే వార్త కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. అయితే అది నిజమే అని, ఇప్పటికే చరణ్ కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కం ఎమోషనల్ స్టోరీ రాస్తున్న గౌతమ్, చరణ్ పాత్ర ని అద్భుతంగా చెక్కుతున్నారని సమాచారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ ఏడాది చివర్లో రానున్నట్లు టాక్. మరి ఫస్ట్ టైం గౌతమ్ తో చరణ్ చేయనున్న ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post