రాజమౌళి - సుకుమార్ ఒక్కటే.. చెప్పి చెప్పి విసుగొచ్చింది!


టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న రచయితలలో కే విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన ఎలాంటి కథలు రాసినా కూడా ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన భవిష్యత్తు ప్రణాళికపై అలాగే RRR సినిమా గురించి కూడా చెబుతున్నారు. ఇక రీసెంట్ గా సుకుమార్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ఆయన తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

కె విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'డైరెక్షన్ చేయడంలో సుకుమార్ రాజమౌళి ఆలోచన విధానం ఒకే తరహాలో ఉంటుంది. ఇద్దరు కూడా చాలా నెమ్మదిగా వర్క్ చేస్తారు. వారు చేసే పనిపై చాలా నిబద్ధతతో ఉంటారు. ఎలాంటి సినిమాలు చేసిన కూడా సరైన ఎమోషన్ తో తెరపైకి తీసుకు వస్తారు. అయితే తొందరగా సినిమాలు చేయమని రాజమౌళికి వంద సార్లు చెప్పాను. అయినప్పటికీ అదే తరహాలో నెమ్మదిగా వర్క్ చేస్తున్నాడు. చెప్పి చెప్పి నాకే చాలా సార్లు విసుగు పుట్టింది' అని ఈ బాహుబలి రైటర్ వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post