ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీపై అందరిలో ఎన్నో భారీ ఆశలు ఉన్న విషయం తెల్సిందే. రాజమౌళి నుండి బాహుబలి సినిమాల తరువాత వస్తున్న మూవీ కావడం అలానే దీనికి నిర్మాత దానయ్య ఏకంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చుపెడుతుండడంతో ఈ మూవీ యావత్ భారత దేశంలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారింది. చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమురం భీం గా చేస్తున్న ఈ సినిమా కి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో సముద్రఖని, శ్రియ శరణ్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ భారీ పాన్ ఇండియా మూవీని మొదట గత ఏడాది జులై 30న విడుదల చేయాలని భావించారు, అయితే మధ్యలో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో జనవరి 8కి వాయిదా వేశారు. ఆ తరువాత మధ్యలో కరోనా ఎఫెక్ట్ వలన థియేటర్స్ మూతబడడంతో ఇటీవల దానిని అక్టోబర్ 13కి వాయిదా వేయడం జరిగింది. ఇక ప్రస్తుతం లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది ఉగాది కి వాయిదా పడనుందని అంటున్నారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అనే భయంతో పాటు ఇంత భారీ సినిమాని హడావుడిగా రిలీజ్ చేయడం కంటే మెల్లగా సమయం చూసుకుని వద్దాం అని యునిట్ ఉగాదికి ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
Follow @TBO_Updates
Post a Comment