ఒకప్పుడు భూమిక.. ఇప్పుడు బుట్టబొమ్మ ?


తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి పెద్ద స్టార్స్ గా పేరున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురూ తమ కెరీర్ పరంగా నటించిన ఏడవ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసి వాటితో ఏకంగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకున్న ఘనత భూమిక కే దక్కుతుంది. మహేష్ తో ఒక్కడు, పవన్ కళ్యాణ్ తో ఖుషి, ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాలు చేసిన భూమిక తద్వారా ఎనలేని కీర్తిని సొంతం చేసుకుంది. 

ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ని బట్టి ఈ ముగ్గురు బడా స్టార్స్ కెరీర్ 28వ సినిమాల్లో నటించే ఛాన్స్ సంపాదించిందట యువ భామ పూజా హెగ్డే. ఎన్టీఆర్ 28వ సినిమా అరవింద సమేత లో ఇప్పటికే నటించి దానితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూజా, త్వరలో త్రివిక్రమ్ తో మహేష్ చేయనున్న 28వ సినిమా, అలానే హరీష్ శంకర్ తో పవన్ చేయనున్న 28వ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ మూవీ కి సంబంధించి ఆమె కన్ఫర్మ్ అయినట్లు ఆల్రెడీ ప్రకటన రాగా, పవర్ స్టార్ జన్మదినం రోజున ఆయన 28వ సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా కన్ఫర్మేషన్ రానున్నట్లు చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే పూజా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే.


Post a Comment

Previous Post Next Post