ఆకట్టుకునే కథ, కథనాలతో తెరెక్కిన యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ పలాస 1978 అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆ సినిమాని తెరకెక్కించిన యువ దర్శకుడు కరుణ కుమార్ పై సర్వత్రా ప్రశంసలు కురిసాయి. దాని తరువాత సుధీర్ బాబు తో కరుణ కుమార్ తీసిన లేటెస్ట్ సినిమా శ్రీదేవి సోడా సెంటర్. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఆ మూవీ కూడా మంచి టాక్ తో కొనసాగుతోంది.
అయితే ఈ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా నేడు కరుణ కుమార్ మాట్లాడుతూ, తనవద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయే మంచి యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీ సిద్ధం గా ఉందని, అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆయనని కలిసి కథ ని వినిపించాలని తాను భావిస్తున్నట్లు తేలిపారు. ఇక యువ దర్శకులకు చాన్సు ఇవ్వడంలో ఎప్పుడూ ముందే ఉండే పవన్, కరుణ కుమార్ కథ కనుక నచ్చితే ఎంతవరకు ఛాన్స్ ఇస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment