నవీన్ పొలిశెట్టికి మరో బంపరాఫర్!


ప్రస్తుతం యువ నటుడిగా మంచి పేరుతో కొనసాగుతున్నారు నవీన్ పోలిశెట్టి. మొదట నటుడిగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చేసిన నవీన్ ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ మూవీ వన్ నేనొక్కడినే లో కీలక రోల్ చేసారు. ఇక ఇటీవల ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరోగా మారి సూపర్ సక్సెస్ కొట్టిన నవీన్, కొన్నాళ్ల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జాతి రత్నాలు మూవీలో ఒక హీరోగా నటించారు. 

అయితే తదుపరి యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్న సినిమాలో నటించనున్న నవీన్, ఆపై జాతి రత్నాలు మూవీ టీమ్ లో పని చేసిన శంకర్ అనే యువ దర్శకుడి తో ఒక సినిమా చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో నవీన్ ఒక వెరైటీ రోల్ చేస్తుండగా దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Post a Comment

Previous Post Next Post