సైమా నామినేషన్స్ లో మహేష్ మహర్షి జోరు!


ప్రతి ఏటా ప్రకటించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ) అవార్డుల్లో భాగంగా 2019 వ సంవత్సరానికి గాను పలు సౌత్ భాషల అవార్డుల నమిలేషన్స్ ని నేడు సైమా వారు అధికారికంగా ప్రకటించగా వాటిలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సూపర్ హిట్ మూవీ మహర్షి మొత్తం 10 అవార్డు క్యాటగిరి నామినేషన్స్ లో నిలిచాయి. స్నేహబంధం యొక్క గొప్పతనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ అద్భుత యాక్టింగ్ తో పాటు అల్లరి నరేష్ ఆకట్టుకునే నటన, రైతుల సమస్యలు వంటివి ప్రేక్షకాభిమానులని అలరించి మూవీ ని భారీ సక్సెస్ చేసాయి. 

వాటిలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో మహర్షి ఓట్లు దక్కించుకోనుండగా ఇప్పటికే బెస్ట్ యాక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ కు భారీ స్థాయిలో వోటింగ్స్ నమోదవుతున్నట్లు సమాచారం. ఇక అటు తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్, అలానే కన్నడ లో యజమానా, అలానే మలయాళంలో కుంబలంగి నైట్స్ సినిమాలు కూడా భారీగా నామినేషన్స్ లో నిలిచాయి. మరి త్వరలో ప్రేక్షకుల వోటింగ్ తో వీరిలో ఎవరెవరు అవార్డులు గెలుచుకోనున్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే....!!


Post a Comment

Previous Post Next Post