వంద మందితో కొమురం భీం భారీ ఫైట్ !


జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అందరిలోనూ అంచనాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. హై టెక్నీకల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ ఫైట్ చిత్రీకరించారని, ఈ ఫైట్ లో కొమురం భీం ఏకంగా 100 మంది బ్రిటిషర్స్ పై చేసే భారీ యుద్దాన్ని చిత్రీకరించారని అంటున్నారు. 

సినిమాలోని మేజర్ హైలైట్స్ లో ఈ ఫైట్ కూడా ఉండనుందని, అలానే ఇలాంటి అద్భుతాలు సినిమాలో ఎన్నో ఉన్నాయని, అటు చరణ్ పై కూడా మరొక భారీ ఫైట్ చిత్రీకరించినట్లు చెప్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పటికీ సస్పన్స్ కొనసాగుతూ ఉండడంతో మేకర్స్ త్వరలో లేటెస్ట్ విడుదల డేట్ ని ప్రకటిస్తారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post