170కోట్ల సినిమాకు భారీ దెబ్బ .. థియేటర్ లో ముగ్గురే!!


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తన స్టార్డం తో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సాగె యాక్షన్ నుండి ఇటీవల విడుదలైన సినిమా బెల్ బాటమ్. రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వశు భగ్నానీ, జాకీ భగ్నానీ ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. 1980ల బ్యాక్ డ్రాప్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే షాకింగ్ గా తొలిరోజున ఈ సినిమా కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కలెక్షన్ అందుకోవడం నిజంగా షాకింగ్ విషయం. 

అలానే ఒక థియేటర్ లో కేవలం ముగ్గురు మాత్రమే ఆడియన్స్ ఉండడంతో ప్రస్తుతం మన దేశంలో కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఎంతలా భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. మంచి టాక్ వచ్చినప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ మూతబడడంతో పాటు మరికొన్ని చోట్ల ప్రేక్షకులు రాకపోవడంతోనే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని, ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో థియేటర్స్ లో సినిమా చూడడం కలగానే మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Post a Comment

Previous Post Next Post