మెగా మూవీలో మంచి ఛాన్స్ కొట్టేసిన అనసూయ!


బుల్లితెరపై లేడీ యాంకర్ గా తన టాలెంట్ తో అందరి మనసులు గెలుచుకున్న అనసూయ భరద్వాజ్, ఆ తరువాత మెల్లగా సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకున్నారు. ఇక ఇటీవల అడివి శేష్ హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం, అలానే రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీలో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప మూవీలో ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్లు టాక్. 

అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం త్వరలో మెగాస్టార్ తో మోహన్ రాజా తీయనున్న గాడ్ ఫాదర్ మూవీ లో అనసూయ ఒక కీలక రోల్ లో నటించనున్నట్లు చెప్తున్నారు. సినిమాలో ఆమెది ఎంతో ఇంపార్టెంట్ రోల్ అని సమాచారం. మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రిమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు దీనిని నిర్మించనుండగా థమన్ సంగీతం అందించనున్నారు.


Post a Comment

Previous Post Next Post