టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తనే నెంబర్ వన్ అని నిరూపించుకున్నాడు. మళ్ళీ ఈసారి కూడా 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చాలా మంది అగ్రశ్రేణి తారలను దాటుకుంటూ, విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం.
అయితే గతంలోనే విజయ్ తన కాన్ఫిడెన్స్ ను ఓపెన్ గా బయటకు చెప్పుకున్నాడు. మరోసారి తప్పకుండా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్‌ను అందుకుంటానని చెప్పాడు. ఇక అన్నట్లుగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ప్రస్తుతం ఈ హీరో లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కానుంది. అలాగే సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment