సీనియర్ నటుడు సోనూసూద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక రియల్ హీరో అనే ట్యాగ్ తో క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నటుడిగా కంటే కూడా అతను చేసిన మంచి పనులే అతని బ్రాండ్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేశాయి. గత ఏడాది మొత్తం సోనూసూద్ తన సొంత డబ్బుతోనే అత్యదిక సహాయలు చేశాడు.
అనంతరం విరాళాలు కూడా వస్తున్నప్పటికీ సోనూసూద్ జేబులో నుంచే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక సినిమాల్లో విభిన్నమైన పాత్రలు వస్తుండడంతో రెమ్యునరేషన్ డోస్ కాస్త పెంచినట్లు టాక్ వస్తోంది. ఇంతకుముందు 2కోట్ల వరకు అడిగిన సోనూసూద్ ఇప్పుడు దాదాపు 7కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ రేటు కొంతమంది నిర్మాతల్లో ఆందోళన కూడా కలిగిస్తోందట. ఇక సోనూసూద్ హీరోగా కూడా ఛాన్సులు అందుకుంటున్నాడు. మరి ఆ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment