మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో గ్యాప్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్స్ ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లా స్థాయిలో ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆక్సిజన్ అవసరమైన ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వారు చేస్తున్న పనిపై సోనూసూద్ స్పందించాడు.
గత ఏడాది నుంచి సోనూసూద్ కోవిడ్ బాధితుల కోసం సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా నిర్మించాడానికి భారీగా ఖర్చు చేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తుండడంతో సోనూసూద్ ఈ విధంగా స్పందించాడు. ' చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తూ చాలా గొప్ప పని చేస్తున్నారు. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment