సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనంతరం ఎంత వేగంగా రావాలని అనుకున్నాడో తెలియదు గాని అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యంగానే సినిమా రాబోతోంది. ఇప్పుడు అనుకుంటున్న తేదీకి వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ మహేష్ మాత్రం ముందైతే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు.
ఇక లాక్ డౌన్ ఎత్తివేస్తే సినిమా షూటింగ్స్ ను స్టార్ట్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. సర్కారు వారి పాట టీమ్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తొందరపడకుండా జూలై నుంచి షూటింగ్ స్పీడ్ పెంచాలని ఆలోచిస్తున్నారు. ఎలాగైనా నవంబర్ లోగా షూటింగ్ పనులన్ని పూర్తయ్యేలా ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్లగలిగితే అనుకున్నట్లుగా సంక్రాంతికి సినిమాని విడుదల చేయవచ్చని ఫిక్స్ అయ్యారట. మరి ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment