యువ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత కొంచెం పేరున్న సీనియర్ దర్శకులతో వర్క్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న రామ్ ఆ తరువాత రెడ్ సినిమాతో యవరేజ్ హిట్ కొట్టాడు. ఇక వెంటనే తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామితో ఒక సినిమా సెట్ చేసుకున్న విషయం తెలిసిందే.
బైలాంగ్యువల్ సినిమాగా రాబోతున్న ఆ ప్రాజెక్ట్ పై రామ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక మరొక తమిళ్ డైరెక్టర్ తో కూడా రామ్ ద్విభాషా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. ఏఆర్.మురగదాస్. ఇటీవల మహేష్ బాబుతో స్పైడర్ అనంతరం మళ్ళీ తెలుగు హీరోతో సినిమా చేయని మురగదాస్ ఇప్పుడు రామ్ తో చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment