Nithin 'Maestro' OTT deal details


యువ హీరో నితిన్ మాస్ట్రో సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల పూర్తయ్యింది. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు ఓటీటీ డీల్ ద్వారా మంచి ఎమౌంట్ అందినట్లు తెలుస్తోంది.

దాదాపు 30జోట్లకు క్లోజ్ చేసినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కుల కోసం పోటీ పడినప్పటికి రౌండ్ ఫిగర్ ఎమౌంట్ హాట్ స్టార్ దక్కించుకున్నట్ల సమాచారం. సినిమాను నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ లోనే నిర్మించారు. ఇక థియేటర్స్ ను నమ్ముకొని రిస్క్ చేయడం కంటే సైలెంట్ గా డీల్ క్లోజ్ చేసుకోవడం బెటర్ అని నితిన్ ఒప్పేసుకున్నాడట. మరి ఓటీటీలో ఈ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post