తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి రాజకీయ వాతావరణం నెలకొంది. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA అధ్యక్ష పదవి కోసం మరోసారి రెండు వర్గాలకు సంబంధించిన అగ్ర నటులు మధ్య పోటీ జరగబోతోంది. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు VS సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా మా అధ్యక్ష పదవిలో కొనసాగిన వారు మరోసారి పోటీ చేయడానికి వీలు లేదు. ఇక ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేష్ నెక్స్ట్ ఎన్నికల్లో తన మద్దతును మంచు విష్ణుకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తండ్రి మోహన్ బాబుతో కలిసి కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు ఈ ఎన్నికలను సిరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ కీలకం కానుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ని జరిగినా కూడా ఇటీవల కాలంలో మోహన్ బాబు చిరంజీవి క్లోజ్ గానే ఉంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ మెగాస్టార్ మద్దతు దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాడు. మరి ఆయన మద్దతు ఎవరికి అందిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment