కరోనా మొదలైన తరువాత ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయంలో అస్సలు క్లారిటీ రావడం లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాకు సంబంధించిన ఎనౌన్స్మెంట్స్ చాలానే వస్తున్నాయి కానీ సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయన్న గ్యారెంటీ అయితే లేదు.
ఇక దర్శకుడు కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ 30వ సినిమా కోసం పర్ఫెక్ట్ ప్లాన్ తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆచార్య పనులైపోగానే ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేస్తారట. మరోవైపు తారక్ RRRకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరో ఉన్నా లేకపోయినా కూడా కొరటాల శివ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ముందు ఎన్టీఆర్ తో అవసరం లేని సీన్స్ ను కొన్ని పూర్తి చేసి అనంతరం ఒకేసారి తారక్ కు సంబంధించిన సన్నివేశాలను ఫినిష్ చేస్తారట. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కరెక్ట్ గా 7నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లాన్ అయితే రేడి అయ్యిందట. మరి తారక్ ఎలా సపోర్ట్ చేస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment