మొదటి పాన్ ఇండియా.. ఎప్పుడంటే?


సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా మార్కెట్ కటెక్ట్ గా పెరుగుతున్న సమయంలోనే కరోనా ప్రభావం తీవ్రంగా చూపించింది. ముఖ్యంగా అప్పులతో సినిమాలను నిర్మించిన వారి పరిస్థితి మరీ దారుణం. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ లో కేసులు తగ్గడంతో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చాలామంది ఆశతో ఉన్నారు.

ఇక కరోనా అనంతరం కొన్ని పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ పాన్ ఇండియా సినిమాలు రాలేదు. ఇక ఆ ఎఫెక్ట్ అనంతరం రాబోయే మొదటి పాన్ ఇండియా సినిమా తలైవి అని తెలుస్తోంది. కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటించిన ఆ సినిమా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ కావాల్సిన ఆ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన వాయిదా పడింది. ఇక ఇప్పుడు కొత్త డేట్ పై చర్చలు మొదలైనట్లు సమాచారం. మరికొన్ని రోజులు ఓపిక పట్టి పరిస్థితులు అనుకూలిస్తే సినిమా విడుదలపై ఒక నిర్ణయానికి రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post