సినిమా ఇండస్ట్రీలో ఏదైనా విషాదం చోటు చేసుకుంటే ఒక్కసారిగా ఆ విషయం వైరల్ అవ్వడం కామన్. అయితే కొన్నిసార్లు నిజానిజాలు తెలుసుకోకుండా అడ్వాన్స్ వార్తలు రాయడం కామన్ గా మారిపోయింది. ఇటీవల ఒక యువ హీరో ఇంకా ప్రాణాలతో పోరాడుతూ ఉండగానే నేషనల్ మీడియా సైతం ఏ మాత్రం అవగాహన లేకుండా మరణించాడు అంటూ ఇష్టానుసారంగా బ్రేకింగ్ అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు.
కన్నడ టాలెంటెడ్ యాక్టర్ నేషనల్ అవార్డు విన్నర్ సంచారి విజయ్ ఈ నెల 12న రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే తలకు బలంగా గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. బ్రతికే అవకాశం లేదని చెప్పడంతో అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే కేవలం నిర్ణయం మాత్రమే. ఇంకా విజయ్ మరణించలేదు. బ్రెయిన్ డెడ్ అయితే వైద్యులు అంత ఈజీగా నిర్ణయం తీసుకోరు. ప్రస్తుతం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్వాసతోనే ఉన్నాడు. అలా ఉండగానే మరణించినట్ల వార్తలు రాయడం బాధాకరం.
Follow @TBO_Updates
Post a Comment