దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన భాషల్లో రూపొందుతున్న బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా భారీగా క్రేజ్ అందుకుంటోంది. సౌత్ లో ఆ షో అంతగా క్లిక్కవ్వకపోవచ్చని అనుకున్నారు. కానీ ఎన్ని వివాధాలు చోటు చేసుకున్నా కూడా షోలకు ఏ మాత్రం బ్రేక్ పడడం లేదు. ఒక విధంగా కాంట్రవర్సీతోనే భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటున్నాయి.
ఇక చాలా రోజుల అనంతరం బిగ్ బాస్ లలో సీనియర్ నటీనటులు కూడా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ఖుషిలో నటించిన భూమిక కూడా బిగ్ బాస్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మన లాంగ్వేజ్ లో కాదు. హిందీ బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ ద్వారానే భూమికను సెలెక్ట్ చేసే అవకాశం ఉందట. భాయ్ ఆమె పేరును సజెస్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. మరి సున్నితంగా కనిపించే భూమిక ఆ వివాదాల కొంపలో ఎలా వేగుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment