Anil Ravipudi next with Small Hero?



F2 , సరిలేరు నీకెవ్వరు సినిమాలతో కమర్షియల్ బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంతో దర్శకుడు అనిల్ రావిపూడి వాల్యూ గట్టిగానే పెరిగింది. స్టార్ హీరోలు కాస్త బిగ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రిలీఫ్ కోసం అనిల్ రావిపూడితో ఒక కామెడీ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు. 

అయితే ప్రస్తుతం అగ్ర హీరోలు చాలా వరకు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం F3 సినిమాతో బిజీగా ఉన్న అనిల్ ఆ తరువాత మహేష్ బాబు, బాలకృష్ణ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ఇద్దరు దొరికే అవకాశం లేదని అర్ధమవుతోంది. ఇక ఎవరు సెట్టవ్వకపోతే శర్వానంద్ తో కూడా సినిమా చేయడానికి అనిల్ సిద్ధంగా ఉన్నాడట. ఈసారి కామెడీ యాంగిల్ ను థ్రిల్లర్ లో మిక్స్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post