Allu Arjun shocking remuneration for Pushpa!!


టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా కొత్త ట్యాగ్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో గాని ఆ సినిమాపై వస్తున్న ప్రస్తుత కథనాలు మాత్రం ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సుకుమార్ నెవర్ బిఫోర్ అనేలా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మొదట ఈ సినిమాను 130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత రెండు బాగాలుగా రిలీజ్ చేయాలని అనుకున్న అనంతరం బడ్జెట్ మరికొంత పెరిగింది. ముఖ్యంగా రెమ్యునరేషన్ ప్రభావం ఎక్కువ పడినట్లు సమాచారం. ఇక బన్నీకి రెండు భాగాలకు కలిపి ఏకంగా 70కోట్లు ఇస్తున్నట్లు టాక్ వేస్తోంది. సడన్ గా సినిమా మార్కెట్ పెరగడం వల్ల ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ సినిమా చేయడానికి బన్నీ చర్చలు మొదలుపెడుతున్నాడు. త్వరలోనే ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post