100కోట్ల రెమ్యునరేషన్.. దిల్ రాజు తట్టుకుంటాడా?


టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో దిల్ రాజు ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాలతోనే ఎక్కువగా లాభాలు అందుకుంటూ ఉంటారు. ఇక  పెద్ద సినిమాలంటే అంతగా రిస్క్ చేయరు. అయితే దిల్ రాజు మొదటిసారి ఒక హీరోకు 100కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఒక ద్విభాషా సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు విజయ్ దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం, ఇప్పటికే 10కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట.
అయితే ఆ సినిమా బడ్జెట్ 200కోట్లు దాటేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. దిల్ రాజు ఇప్పటివరకు ఎవరికి ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. గతంలో ఇండియన్ 2 బడ్జెట్ కు భయపడి వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఆ స్థాయిలో రేట్లు పెరిగితే తట్టుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

Previous Post Next Post