వరుణ్ తేజ్ రెమ్యునరేషన్.. అందరికంటే ఎక్కువ!


మీడియం రేంజ్ హీరోలకు సాధారణంగా ఒక 10కోట్లు ఇస్తేనే చాలా ఎక్కువ అని ప్రస్తుతం నిర్మాతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ యువ హీరోలు మాత్రం ఆ బార్డర్ ను దాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తు మార్కెట్ పై నమ్మకంతో ముందుగానే సాలీడ్ గా డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటికే నాని 10కోట్ల మార్క్ ను టచ్ చేయగా.. శర్వానంద్, నితిన్ రేపో మాపో ఈజీగా ఆ స్టేజ్ లోకి వచ్చేస్తారు. ఇక మీడియం రేంజ్ హీరోల్లో అందరికంటే ఎక్కువగా వరుణ్ తేజ్ ఒక సినిమా కోసం 13కోట్లను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. F3 సినిమా కోసం 9కోట్ల దగ్గరకు వచ్చిన ఈ మెగా హీరో భవిష్యత్తు సినిమాల విషయంలో మాత్రం లాంగ్ జంప్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post