సీనియర్ దర్శకుడు వివి.వినాయక్ ఒకప్పుడు దిల్, ఆది, ఠాగూర్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఖైదీ నెంబర్ 150 తరువాత పెద్దగా క్లిక్కవ్వని వినాయక్ దర్శకుడిగా వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన స్క్రిప్ట్ రెడీ అవ్వడం లేదు.
ఇక చాలా రోజుల అనంతరం ఆయన మళ్ళీ నటుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఠాగూర్ సినిమాలో ఒక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత శీనయ్య అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక పవన కళ్యాణ్ - రానా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ లో ఒక చిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక పవర్ఫుల్ డైలాగ్ తో సినిమాలో మంచి ఎలివేషన్ క్రియేట్ చేస్తాడని టాక్ వస్తోంది. మరి ఆ పాత్రతో వినాయక్ ఎంతవరకూ క్లిక్కవుతాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment