టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక మంచి క్రేజ్ అందుకున్న ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఉదయ్ కిరణ్ కొన్నాళ్లకు ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ చూడాల్సివచ్చింది.
ఇక ఉదయ్ కిరణ్ చనిపోయే ఏడాది ముందు ఒక సినిమాను ఇష్టపడి చేశాడు. అదే 'చిత్రం చెప్పిన కథ'. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. అలాగే అప్పట్లో మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నప్పటికీ ఎందుకో సెట్స్ పైకి రాలేదు. ఇక చిత్రం చెప్పిన కథ ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. నిజానికి ఓటీటీ డీల్స్ నిర్మాతలు మాట్లాడినప్పటికి ఎందుకో ఇంకా ఫైనల్ కాలేదట. ఇంకా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సరైన డీల్ వచ్చిన తరువాత రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment