లాక్ డౌన్ ఎత్తివేత.. థియేటర్స్ సంగతేంటి?


మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను ఎత్తివేసినట్లు తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ అధికారికంగా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గడంతో ఆరోగ్య శాఖ సమాచారం మేరకు ఈ నిర్ణయం తీలుకున్నట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది గాని థియేటర్స్ సంగతి మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంది.

ముందుగా తెలంగాణలో అయితే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆంద్రప్రదేశ్ లో ఇంకా నైట్ కర్ఫ్యూ ఎత్తి వేయలేదు. అలాగే అక్కడ టికెట్ల రేట్ల తగ్గించడంపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో చిన్న సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. థియేటర్స్ మళ్ళీ 50% ఆక్యుపెన్సీతోనే అంటే అది రిస్క్ అనే చెప్పాలి. ఇప్పట్లో అయితే మీడియం బడ్జెట్ సినిమాలు వచ్చేలా లేవు. థియేటర్స్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటేనే విడుదల చేయాలని చూస్తున్నారు. ఏదేమైనా పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్ట్ నుంచి అసలైన సినిమా సందడి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post