తెలుగు దర్శకుడితో సూర్య.. నిజం కాదు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో సూర్య ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకేసారి తమిళ్ తెలుగులో విడుదల చేసే సూర్య ఎన్నోసార్లు ఇక్కడి హీరోలతో సమానంగా హిట్స్ అందుకున్నాడు. అయితే ఎప్పుడు కూడా కమల్ హసన్, రజనీకాంత్ స్టైల్ లో డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయలేకపోయాడు.

మంచి కథ సెట్టయితే డబ్బింగ్ సినిమా కాకుండా డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ సరైన కథ దొరకడం లేదు. అయితే ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక కథ సెట్టయినట్లు టాక్ వచ్చింది. అలాగే బోయపాటి శ్రీనుతో కూడా మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. అయితే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సెట్టయినట్లు వచ్చిన న్యూస్ నిజం కాదు. అదొక రూమర్ మాత్రమే. ఇక బోయపాటితో సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ సూర్య మాత్రం ఎప్పటికప్పుడు తెలుగు దర్శకులకు టచ్ లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post