ప్రయోగలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న స్టార్ హీరో సూర్య త్వరలోనే మరొక రియల్ కథను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాశం నీ హద్దురా సినిమాతో ఓటీటీలో సాలీడ్ హిట్ అందుకున్న సూర్య ఈసారి తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
నేషనల్ అవార్డు విన్నర్ పాండిరాజ్ దర్శకత్వంలో తన 40వ సినిమా చేయనున్న సూర్య పవర్ఫుల్ క్రైమ్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం తమిళనాడు పొల్లాచ్చిలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ ఘటన ఆధారంగా ఆ సినిమా ఉంటుందట. నిందితులను పట్టుకునే ఆఫీసర్ గా సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment