స్టార్ హీరో కొడుకుతో శ్రీనువైట్ల.. హిట్టు కోడితేనే?


టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ దర్శకులు ఫామ్ లోకి రావడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక శ్రీనువైట్ల కూడా మళ్ళీ తన పాత కామెడీ టైమింగ్ ను తీసుకువస్తానని శపథం చేస్తున్నాడు. ఢీ సినిమా ఫార్మట్ లోనే ఢీ అండ్ ఢీ డబుల్ డోస్ అనే సినిమాతో రాబోతున్నారు.

ఆ సినిమా హిట్టయినా కాకపోయినా శ్రీనువైట్లకు ఒక ఆఫర్ అయితే రెడీగా ఉందట. మైత్రి మూవీ మేకర్స్ ఆయనతో సినిమా చేయాలని కమిట్మెంట్ తీసుకుంది. అయితే కథ నచ్చితేనే ప్రాజెక్ట్ ముందుకి వెళుతుందని కండిషన్ పెట్టారట. ఇక సినిమా హిట్టయితే వైట్ల కోరుకున్న హీరోను ఇస్తారట. మరోవైపు మైత్రి చేతుల్లో అఖిల్ డేట్స్ కూడా ఉన్నాయి. అతనితో సినిమా చేయడానికి కమిట్మెంట్ అయితే తీసుకున్నారు. కథ సెట్టయితేనే ఆ కాంబినేషన్ సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post