మెగాస్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ?


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. ఇక ఆ సినిమా అయిపోగానే వెంటనే మరొక రెండు సినిమాలను లైన్ లో పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ పై ఒక క్లారిటికి వచ్చేశారు. ఆ సినిమాతో పాటు బాబీ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురానున్నారు.

ఇక మెగాస్టార్ కు హీరోయిన్స్ ను వెతకడం ఇప్పుడు దర్శకులకు పెద్ద టాస్క్ గా మారింది. దర్శకుడు బాబీ ఇటీవల ఇద్దరు బాలీవుడ్ హీరోల పేర్లు మెగాస్టార్ కు సజెస్ట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. అందరి చూపు ఎక్కువగా సోనాక్షి సిన్హా పైనే ఉన్నట్లు సమాచారం. అలాగే బిపాషా బసు అని కూడా అంటున్నారు గాని ఫైనల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎవరు ఫిక్స్ అవుతారనేది చెప్పలేము. ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ కు జోడిగా మరోసారి కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post