హ్యాపీడేస్ - లీడర్ - ఫిదా - వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటిసారి బార్డర్ దాటి ధనుష్ తో వర్క్ చేయబోతున్నాడు. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రానున్న ఆ సినిమాను ఏషియన్ గ్రూప్స్ అధినేతలు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
ఇక ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. హీరో ధనుష్ జగమే తందిరమ్ సినిమాకు 15కోట్ల వరకు తీసుకోగా ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం 30కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక శేఖర్ కమ్ముల కూడా మొన్నటి వరకు 8కోట్లు తీసుకోగా ఇప్పుడు ట్రిలాంగ్యువల్ సినిమాకు 15కోట్లకు పైగానే అందుకుంటున్నాడట. అంటే దాదాపు ఆయన కూడా డబుల్ ఎమౌంట్ తీసుకోబోతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment