దర్శకుడు శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటిసారి బార్డర్ దాటి తమిళ్ హీరోను పట్టేశాడు. సింపుల్ కథలతో ఎన్నోసార్లు బడా హీరోలను పట్టాలని చూసిన శేఖర్ కమ్ములకు అవకాశం దొరకలేదు. ఇక ఫైనల్ గా టాలెంటెడ్ హీరో ధనుష్ కు కథ చెప్పి ఓకే చెప్పాడు.
మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా చేయాలని కమ్ముల చాలా సార్లు ప్రయత్నం చేశాడు. కాని వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా డిఫరెంట్ సినిమాలను చేసే ధనుష్ ఒప్పుకున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు. త్రిభాషా సినిమాగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కథ వినిపించగనే ధనుష్ ఏ మాత్రం సందేహీంచకుండా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధనుష్ కు తెలుగు మార్కెట్ పై పట్టు దొరికినట్లే అని చెప్పవచ్చు. లవ్ స్టొరీ సినిమాను నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ LLP ప్రొడక్షన్ లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment