కమెడియన్ గా మంచి క్రేజ్ అందుకున్న సప్తగిరి హీరోగా వెండితెరపై అల్లరి చేసి చాలా కాలమయ్యింది. ఇక ఇప్పుడు ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరొక డిఫరెంట్ సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే రీసెంట్ గా ఫినిష్ అయ్యింది. సీనియర్ సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకోబోతున్నాడు. కె. ఎం.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరు పొందిన ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేయనున్నారు.
*సాంకేతిక నిపుణులు:*
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్
Post a Comment