మొత్తానికి మొదటి వెబ్ సిరీస్ తో సమంత హిట్టు కొట్టేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ గా కనిపించిన సమంత నెవర్ బిఫోర్ అనేలా బోల్డ్ పాత్రతో షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ సినిమాలో ఆమెతో లవ్ ట్రాక్ కూడా ఉండాలని టెర్రరిస్ట్ గా కనిపించిన షాహాబ్ అలీ వివరణ ఇచ్చారు.
వెబ్ సిరీస్ మొత్తం చూశాక అందులో లవ్ ట్రాక్ లేకపోవడం పెద్ద సమస్య ఏమి కాదని కథకు అవసరం లేకపోవడం వల్లనే ఆ సీన్స్ ను కట్ చేసినట్లు వివరణ ఇచ్చారు. అయితే బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం వివాదాలకు భయపడి సీన్స్ ను తొలగించారని తెలుస్తోంది. తమిళ టైగర్స్ ను ఉగ్రవాదులతో సమానంగా చూపించారని విమర్శలు రాగా అలాంటి లవ్ స్టోరీని ఉగ్రవాదితో మిక్స్ చేస్తే మరింత విమర్శలకు దారి తీసే అవకాశం ఉందని కట్ చేసినట్లు టాక్ వస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment