టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ చేసింది కొన్ని సినిమాలే అయినా వారికంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక అలాంటి బ్యూటీలలో ప్రభాస్ హీరోయిన్ కూడా ఉంది. మిర్చి సినిమాలో అనుష్కతో పాటు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రిచా గంగోపాధ్యాయ గురించి అందరికి తెలిసిందే.
ఇక ఇటీవల ఈ బ్యూటీ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఈ నెల 27న మా ఫ్యామిలీలోకి షాన్ జో అనే కొత్త అబ్బాయి వచ్చాడు అంటూ అతను అచ్చం తన తండ్రిలానే ఉన్నాడు అని రిచా వివరణ ఇచ్చింది. 2019లో తన విదేశీ క్లాస్ మెట్ 'జో'ను పెళ్లి చేసుకున్న రిచా ఫ్యామిలీ లైఫ్ తో బిజీగా మారిపోయింది. సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసింది. శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో నటిగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ అనంతరం మిరపకాయ్ సినిమాతో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక హీరోయిన్ గా ఛాన్సులు ఎక్కువగా వచ్చే టైమ్ లోనే అమ్మడు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది.
Follow @TBO_Updates
Post a Comment