టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజా మొత్తానికి క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. క్రాక్ కంటే ముందు వరకు వరుసగా నాలుగు సినిమాకు దెబ్బ కొట్టడంతో కాస్త వెనక్కి తగ్గిన రవితేజ మళ్ళీ హిట్టవ్వడంతో మార్కెట్ కు తగ్గట్లుగానే తన నెంబర్ ను పెంచాడు.
అసలైతే క్రాక్ సినిమాకు నైజాం హక్కుల్లో వాటా తీసుకోవడం వలన 16కోట్ల వరకు వచ్చింది. నిజానికి అది కాస్త రిస్క్. ఖిలాడి సినిమాకు కూడా అదే అగ్రిమెంట్ తో వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం శరద్ మండవ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు మాత్రం 15కోట్ల వరకు డీల్ సెట్ సెట్ చేసుకున్నాడట. ఇప్పటివరకు రవితేజ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోలేదు. మరి ఆ తరువాత చేయబోయే సినిమాలకు ఏ రేంజ్ లో అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment