బిగ్ బాస్ 5.. హోస్ట్ కోసం కొత్త హీరో?


నేషనల్ వైడ్ గా అన్ని భాషల్లో మంచి క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి రేటింగ్స్ అందుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ తో మొదలైన ఈ కాంట్రవర్సీ షో ప్రతి సీజన్ లో కూడా విభిన్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈసారి హోస్ట్ విషయంలో మరో మార్పు జరగవచ్చని టాక్ అయితే వస్తోంది.

సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరీంచగా ఆ తరువాత రెండు సీజన్స్ కు నాగార్జున హోస్టింగ్ మంచి ప్లస్సయ్యింది. ఇక 5వ సిజన్ కు కూడా ఆయనే ఉండవచ్చని  వార్తలు రాగా ఇప్పుడు కంటిన్యూ కాకపోవచ్చని కొత్త టాక్ వస్తోంది. బంగార్రాజు సినిమాతో పాటు, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయబోయే సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ వలన ఖాళీ సమయం దొరక్కపోవచ్చట. అందుకే ఈసారి నాగార్జున రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఆయన స్థానంలో రానా దగ్గుబాటి వస్తారని అంటున్నారు. రానా నెంబర్ వన్ యారీతో హోస్ట్ గా బాగానే క్రేజ్ అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ ఛాన్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post