టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఓటీటీ మార్కెట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ అమెజాన్ హాట్ స్టార్ ఎంతగా పోటీ పడుతున్నాయో అదే స్థాయిలో తెలుగు సినిమాల కోసం ఆహా కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఓటీటీ బిజినెస్ లోకి రామోజీరావు కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
వందల సంఖ్యలు పాత సినిమా హక్కులు ఈటీవీ వద్దే ఉన్నాయి. అలాగే ఉషా కిరణ్ మూవీస్ లో ఎన్నో హిట్టు సినిమాలను తేరకెక్కించారు. ఆ మూవీస్ ను ఇంకోసారి చూడాలని చాలామందికి ఉంటుంది. ఈటీవీ బ్రాండ్ ను ఓటీటీకి షిఫ్ట్ చేయనున్నట్లు సమాచారం. కేవలం పాత సినిమాలే కాకుండా న్యూ కంటెంట్ కూడా ఉంటుందట. ప్రత్యేకమైన షోలతో పాటు వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా నిర్మిస్తారట. అందుకోసం రామోజీరావు 200కోట్లతో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాడని టాక్ వస్తోంది. తెలుగు కంటెంట్ పై రామోజీరావు కరెక్ట్ గా ఫోకస్ పెడితే ఆహా యాప్ కు గట్టి పోటీ ఎదురైనట్లే!
Follow @TBO_Updates
Post a Comment