నిన్నటి వరకు స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయితే గాని మరొక సినిమాను స్టార్ట్ చేసేవారు కాదు. కానీ కరోనా లాక్ డౌన్ వలన ముందస్తు జాగ్రత్తగా రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ తీసుకున్న హీరోలు ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అయ్యే సరికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమవుతున్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళికి రామ్ చరణ్ డేట్స్ పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితే రెడీగా ఉన్నాడు. కానీ రామ్ చరణ్ కు ఆచార్య ఉండడం వలన ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరో రోజు RRR షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ప్లాన్ ప్రకారమే ఎప్పటికప్పుడు సీన్స్ ను షూట్ చేస్తాడు. కానీ రాజమౌళి అలా కాదు. సీన్ కరెక్ట్ గా వచ్చే వరకు వారం రోజులైనా అదే పనిగా కష్టపడతాడు. అందుకే హీరోలకు మరో సినిమా చేసే వీలు ఉండదు. కానీ ఆచార్యను విడుదలకు సిద్ధం చేయాలి కాబట్టి రామ్ చరణ్ కు తప్పట్లేదు. ఇక డేట్స్ కరెక్ట్ గా సెట్ చేసుకొని ప్లాన్ చేసుకోవడం అంటే జక్కన్నకు టెన్షన్ తో కూడుకున్న పనే.
Follow @TBO_Updates
Post a Comment