రజనీకాంత్ ఉన్నా లెక్క చేయని అజిత్, విజయ్!


కోలీవుడ్ అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చేది మాత్రం అక్కడి ఫ్యాన్స్ వార్. ఎలాంటి సినిమా విడుదలైనా కూడా మరొక వైపు నుంచి ట్రోలింగ్స్ రావడం అక్కడ సర్వసాధారణం. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అక్కడ ఫ్యాన్స్ ఫైట్ మరింత ఉదృతంగా మారుతోంది.

ఇక చాలా రోజుల అనంతరం ఒక డేట్ కోసం ముగ్గురు అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు. రజనీకాంత్ అన్నత్తే సినిమాను వచ్చే దీపావళికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక విజయ్ 65వ సినిమా కూడా అప్పుడే రిలీజ్ కానుందట. మరోవైపు వాలిమై కుడా దీపావళిని టార్గెట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంతటి బడా హీరోలు ఒకేసారి వస్తే వాతావరణం మామూలు అయితే ఉండదు. ముందుగా రజనీకాంత్ డేట్ ఫిక్స్ చేసుకున్నప్పటి అజిత్, విజయ్ అదే సమయంలో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

Post a Comment

Previous Post Next Post